మానసిక వికలాంగుల దినోత్సవాన్ని వికలాంగుల మధ్య ఘనంగా జరుపుకున్నారు సామజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ . వికలాంగులను చిన్న చూపు చూడకుండా చల్లటి మనసున్న మనుషుల్లా గుర్తించాలన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునారావాస కేంద్రంలో మానసిక వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు . కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా మానసిక వికలాంగుల పునారావాస కేంద్రం నిర్వాహకులు శ్రీనివాస్, స్వప్నలను సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ … కరోనా కారణంగా తక్కువ మంది ఉన్నారని , తనకి గత ౩ సంవత్సరాలుగా ఈ కేంద్రం తో అనుబంధం ఉందని, మానసిక వికలాంగులను ఎవరు చిన్నచూపు చూడవద్దన్నారు. వారు మనసున్న దేవతలతో సమానమని చెప్పారు. తుమ్మ నిషాంత్, వికలాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.