ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సిరివెన్నెల మృతిపై ప్రదాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి ఎంతగానో బాధించిందని తెలిపారు. సిరివెన్నెల రచనల్లో కవిత్వ పటిమ ఉందని, తెలుగు భాష ప్రాచుర్యానికి, తెలుగు సినీరంగానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. కేవలం గేయ రచయితనే కాకుండా సిరివెెన్నెల బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలిపారు.