ఒమిక్రాన్ ముప్పున్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కరోనా టెస్టులు చేస్తున్నారు. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో టెస్టు కోసం విదేశీ ప్రయాణికులు క్యూ కట్టారు. రిస్క్ జాబితాలో లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లోనూ ర్యాండమ్ గా 2 శాతం మందిని ఎంపిక చేసి టెస్టులు చేస్తున్నారు. దీంతో ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో కరోనా టెస్టుల కోసం ఆరు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు నాలుగు ముప్పున్న దేశాల నుంచి 1,013 మంది ప్రయాణికులు వచ్చారు. వారందరికీ యాంటీ జెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. ప్రయాణికులకు నచ్చిన టెస్టునే చేస్తున్నారు. అయితే, తక్కువ ధర ఉన్న యాంటీ జెన్ టెస్టుకు భారీ ధరను వసూలు చేస్తున్నారు. ఒక్కో టెస్టుకు రూ. 3,900 చార్జ్ చేస్తున్నారు. దాని కోసం రెండున్నర నుంచి మూడు గంటలు వేచి చూడాల్సి వస్తోంది.
అదే ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం రూ.500గా ఛార్జీని నిర్దేశించారు. ఈ టెస్టు కోసం ఐదు నుంచి ఆరు గంటలు ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. ముప్పున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిందేనని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.