అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ సిఎం సమావేశ మందిరంలో శుక్రవారం ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఉద్యోగుల పిఆర్పీ, ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, కమిటీ సభ్యులుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, శశిభూషణ్ కుమార్, డా. కెవివి సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సేవలు), పి.చంద్రశేఖర్ రెడ్డి, ఎపి ఎన్జీవో, ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వరవు, ఇంకా వివిధ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
About
S6 న్యూస్ ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ అచల మీడియా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోంది. జాతీయ, అంతర్జాతీయ సమాచారంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని సమస్త సమాచారాన్నివేగవంతంగా అందించాలనేది మా ప్రయత్నం. ఆధునిక టెక్నాలజీ సాయంతో ప్రపంచంలోని వార్తా విశేషాలను ఎప్పటికపుడు అప్‌డేట్ చేస్తున్నాం. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న మా నెట్ వర్క్ ద్వారా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వినోదాత్మక అంశాలు, రాజకీయాల్లో రహస్య కోణాలు, వ్యాపారాంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడా విశేషాలను ఈ వెబ్ పోర్టల్‌లో అందిస్తున్నాం. నిజానికి నిలువుటద్దం మా నినాదం. ఆ దిశగా విశేష ప్రాధాన్యతను సంతరించుకున్న వార్తాంశాలతోపాటు, ప్రత్యేక కథనాలను మా S6 న్యూస్ ఛానల్ తోపాటు S6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ లోనూ అప్‌లోడ్ చేస్తున్నాం.