అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్ఠికాహారం అందించాలని, కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలోని 3 అంగన్వాడీ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, చిన్నారులకు కల్పిస్తున్న వసతులు, అందిస్తున్న సౌకర్యాల తీరును పరిశీలించారు. కేంద్రంలో ఎంత మంది పిల్లలు ఉన్నది, ఎంతమంది హాజరు అవుతున్నది పరిశీలించారు. కేంద్ర పరిధిలో ఎంత మంది గర్భిణులు, బాలింతలు ఉన్నది అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు అందిస్తున్న పోషకాహారాన్ని ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. తక్కువ బరువు, పోషణలోపం కలిగివున్న చిన్నారులకు పౌష్ఠికాహారం అందజేస్తూ వారి ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కేంద్రాల్లో ఆటవస్తువులు, డ్రెస్ మెటీరియల్, అందమైన డిజైన్లతో కూడిన రంగులు వేయించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే మౌళిక వసతుల కల్పన కోసం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
About
S6 న్యూస్ ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ అచల మీడియా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోంది. జాతీయ, అంతర్జాతీయ సమాచారంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని సమస్త సమాచారాన్నివేగవంతంగా అందించాలనేది మా ప్రయత్నం. ఆధునిక టెక్నాలజీ సాయంతో ప్రపంచంలోని వార్తా విశేషాలను ఎప్పటికపుడు అప్‌డేట్ చేస్తున్నాం. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న మా నెట్ వర్క్ ద్వారా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వినోదాత్మక అంశాలు, రాజకీయాల్లో రహస్య కోణాలు, వ్యాపారాంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడా విశేషాలను ఈ వెబ్ పోర్టల్‌లో అందిస్తున్నాం. నిజానికి నిలువుటద్దం మా నినాదం. ఆ దిశగా విశేష ప్రాధాన్యతను సంతరించుకున్న వార్తాంశాలతోపాటు, ప్రత్యేక కథనాలను మా S6 న్యూస్ ఛానల్ తోపాటు S6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ లోనూ అప్‌లోడ్ చేస్తున్నాం.